రణ్‌బీర్, ఆలియా ఇప్పుడు తమ తమ ఓన్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెంచాలనుకుంటున్నారు. వారిద్దరూ కలిసి చేసే ప్రాజెక్టుకు ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి, ఇండివిజువల్ ప్రాజెక్టుల కోసం కథలు వినబోతున్నారు. రహాకు జన్మనిచ్చిన తర్వాత ఆలియా షూటింగులకు హాజరవుతున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆలియా ఓ సినిమాలో నటిస్తున్నారు. రణ్‌బీర్‌కపూర్ ప్రస్తుతం రష్మికతో యానిమల్‌లో నటిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్ నటించిన తూ జూటీ మే మక్కర్ రిలీజ్ అయింది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాగానే రణ్‌బీర్ అండ్ ఆలియా కలిసి అయాన్ ముఖర్జీ సెట్స్ కి హాజరవుతారన్నది నిన్నటిదాకా అందరి మనస్సుల్లో ఉన్న మాట. కానీ ఇప్పుడు దానికి ఇంకా టైమ్ ఉందని ఫిల్మ్ మేకర్ ఓపెన్ లెటర్ రాసేశారు.
``బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ విషయంలో అందరి మనసుల్లోని మాటలు విన్నాను. కొందరు బావుందన్నారు. కొందరు ఎక్కడ బాగోలేదో చెప్పారు. అన్నిటినీ అర్థం చేసుకున్నాను. అస్త్రాలకు సంబంధించిన సినిమా అది. అందుకే ఫస్ట్ పార్టుతో పోలిస్తే, రెండు, మూడు పార్టులను తీయడం ఇంకా కష్టమని అర్థమైంది. ఇంకా ఫోకస్ పెంచాలని నిర్ణయించుకున్నాను. దాని మీద శ్రద్ధతో కృషి చేస్తాను. కానీ, అంతకన్నా ముందు ఈ ప్రపంచం నాకు ఇంకో బాధ్యతను అప్పగించింది. దాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నన్ను నేను ఇంకా తెలుసుకుంటాను. ఇంకా జ్ఞానం సంపాదించుకుంటాను. ఆ పని పూర్తి చేసిన తర్వాత బ్రహ్మాస్త్ర షూటింగ్ పనులు మొదలుపెడతాను. బ్రహ్మాస్త్ర రెండు, మూడు పార్టులను ఒకేసారి చిత్రీకరించాలనుకుంటున్నాను. 2026లో రెండో భాగాన్ని, 2027లో మూడో భాగాన్ని విడుదల చేస్తాను`` అని రాశారు అయాన్.
హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2ని తెరకెక్కించడానికి యష్‌రాజ్ ఫిల్మ్స్ సన్నాహాలు చేస్తోంది. దీని గురించే ఇన్‌డైరక్ట్ గా తన లేఖలో ప్రస్తావించారు అయాన్ ముఖర్జీ.
రణ్‌బీర్ కపూర్, ఆలియాతో ఆయన తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర 400 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా తర్వాతే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.